అక్కినేని హీరోకు అక్కగా టాప్ హీరోయిన్ !

27th, December 2017 - 06:43:04 PM

2001లో వచ్చిన ‘ఖుషి’లో మధుమతిగా తెలుగు తెరకు పరిచయమైన భూమిక ఆ సినిమా తరువాత తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించింది. ఆ సమయంలో భూమిక డేట్స్ కోసం వేచి చూసేవాళ్ళు మన దర్శక నిర్మాతలు. రాను రాను భూమికకు తెలుగులు అవకాశాలు తగ్గడంతో కొన్నాలు సినిమాలకు దూరంగా ఉంది.

తాజాగా నాని నటించిన ఎంసిఎ సినిమాతో రీ ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమాలో నానికి వదినగా నటించి మెప్పించిన భూమిక తాజాగా నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో నటిస్తోంది. తాజా సమాచారం మేరకు భూమిక ఈ సినిమాలో చైతు అక్క పాత్రలో దర్శనమిస్తుందని సమాచారం. చందు మొన్దేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో మాధవన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.