ఆ బడా నిర్మాతతో మెగా హీరో సినిమా ?

2nd, November 2017 - 11:22:05 AM

‘స్పైడర్’ సినిమా తో నష్టపోయిన నిర్మాత ఎస్.వి.ప్రసాద్ త్వరలో మరో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు, కష్టాల్లో ఉన్న ఎస్.వి ప్రసాద్ తో సినిమా చెయ్యడానికి రామ్ చరణ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ‘రంగ స్థలం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ ఈ నిర్మాతతో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ టాప్ డైరెక్టర్ తో ఈ0 సినిమాకు సంభందించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఎస్.వి ప్రసాద్ గతంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలిసి చరణ్ తో రచ్చ సినిమా నిర్మించారు, అలాగే అల్లు అరివింద్ తో కలిసి ‘ధ్రువ సినిమా నిర్మించారు. ఆ అనుభందంతో చరణ్ సినిమా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చరణ్ ‘రంగ స్థలం’ మర్చి 29 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.