హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌లతో ప్రభాస్ నమ్మకాన్ని గెలుచుకున్న అగ్ర నిర్మాత

హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌లతో ప్రభాస్ నమ్మకాన్ని గెలుచుకున్న అగ్ర నిర్మాత

Published on May 30, 2023 4:25 PM IST


కనీసం 15 ప్రాజెక్ట్‌లు వివిధ నిర్మాణ దశల్లో, మరో 25 ప్రాజెక్ట్‌లతో ప్రీ ప్రొడక్షన్‌ ప్రారంభ దశలో ఉన్న టీజీ విశ్వప్రసాద్‌ నిస్సందేహంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశంలోనే అగ్రగామి చిత్ర నిర్మాతలలో ఒకరు. రెండు రోజుల క్రితం, విశ్వప్రసాద్ పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో తన హ్యాట్రిక్ అనుబంధం తో వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ప్రభాస్ – మారుతి సినిమాను బ్యాంక్రోల్ చేస్తున్న విశ్వప్రసాద్, ప్రభాస్ ఆది పురుష్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను పొందేందుకు దాదాపు 180 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం.

అక్కడితో ఆగకుండా, విశ్వప్రసాద్ కూడా ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్‌లో సహ నిర్మాతగా చేరాడు. అతను టాప్ హిందీ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, T సిరీస్‌తో కలిసి స్పిరిట్‌ కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. TG విశ్వప్రసాద్ మరియు అతని బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పనితీరుతో ప్రభాస్ ను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అతనితో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కోసం అసోసియేట్ కావాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు