వారణాసి ఎఫెక్ట్ : మహేష్‌ను లాక్ చేసేందుకు నిర్మాతల క్యూ..!

Mahesh Babu

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ ఏడాది చివరినాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మహేష్‌ను తమ నెక్స్ట్ ప్రాజెక్టులో లాక్ చేసందేుకు పలు నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతానికి మహేష్ బాబు ఏ కొత్త సినిమాకు సంతకం చేయనప్పటికీ, మైత్రి మూవీ మేకర్స్ ఆయనతో సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోందట. నవీన్ యెర్నేని ఇప్పటికే మహేష్‌ను కలిసి దర్శకులు, కథాంశాల గురించి చర్చలు జరిపారు.

ఇక ‘కేజీఎఫ్’ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్, కోలీవుడ్ దిగ్గజం సన్ పిక్చర్స్ కూడా మహేష్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు సైతం ఇటీవల ముంబైలో మహేష్‌ను కలిసి చర్చలు జరిపారు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుండటంతో భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతున్నాయి. మరి వీరందరిలో మహేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేసేందుకు ఓకే చెబుతాడో చూడాలి.

Exit mobile version