మహేష్ 25వ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు !

14th, August 2017 - 10:04:45 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్ర ప్రారంభోత్సవం కొద్దిసేపటి క్రితమే మొదలైంది. మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు ఆయన పిల్లలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ 25వ చిత్రమైన ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా టాప్ టెక్నీషియన్లను ఇందులో భాగస్వాములు కానున్నారు.

తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ‘ధృవ, ఊపిరి, విక్రమ్ వేద’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన పిఎస్. వినోద్ కెమెరా వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.