సక్సెస్ఫుల్ గా దశాబ్దం పూర్తి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖ సంస్థ … !

Published on Aug 9, 2022 8:00 pm IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి మూవీ ద్వారా నిర్మాణ సంస్థగా అడుగుపెట్టి తొలి మూవీతోనే పెద్ద విజయం అందుకున్న సంస్థ హారికా హాసిని క్రియేషన్స్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగష్టు 9, 2012న విడుదలైంది. ఇక ఈ సంస్థ ద్వారా సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా ఇప్పటికే పలు భారీ సినిమాలు తెరకెక్కి మంచి విజయాలు అందుకున్నారు. అలానే వీరి బ్యానర్ పై అన్ని సినిమాలకు త్రివిక్రమ్ దర్శకుడు కావడం విశేషం.

అలానే వీరి అనుబంధ సంస్థగా ఏర్పడిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా అనేక సినిమా రూపొందాయి. ఇక దీనిని సూర్యదేవర నాగవంశీ నిర్మాణ పరంగా నడిపిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, నేటితో హారికా హాసిని సంస్థ నుండి ఫస్ట్ మూవీ విడుదలై పది సంవత్సరాలు కావడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ, తమకి ఇంతటి గొప్ప విజయాలు అందిస్తున్న ప్రేక్షకాభిమానులను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పుతూ ఒక చిన్న వీడియో బైట్ ని కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో విడుదల చేసారు. కాగా వీరి సంస్థ నుండి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :