“పుష్ప” రాజ్ ఎంట్రీకి టోటల్ లైన్ క్లియర్.!

Published on Dec 15, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప ది రైజ్”. తమ కంటెంట్ పరంగా చాలా నమ్మకంగా ఉన్న మేకర్స్ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో అన్ని పనులను కూడా చాలా వేగంగా కంప్లీట్ చెయ్యాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ప్రతీ రోజు ఎన్నో గంటల పాటు కష్టపడుతూ సుకుమార్ ఈ సినిమా ప్రీమియర్ ప్రింట్ రెడీ చేస్తున్నారు. అయితే ఇది మళ్ళీ కొన్ని సమస్యల మూలాన క్యూబ్ కి చేరలేదు అని టాక్ ఒకటి రావడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ కి కూడా గురయ్యారు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ అన్ని సమస్యలు కూడా క్లియర్ అయ్యిపోయినట్టు తెలుస్తుంది. పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ ఎంట్రీ అనుకున్న సమయానికి అన్ని చోట్లా ఉంటుందని ఇపుడు కన్ఫర్మ్ అవ్వడంతో మూవీ లవర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత సమాచారం :