ఇంటర్వ్యూ: విక్రమ్ సిరికొండ – ‘టచ్ చేసి చూడు’ ఎంటర్టైనింగా ఉంటుంది !


రవితేజ హీరోగా రాశిఖన్నా , సీరత్ కపూర్ హీరోయిన్ గా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విక్రమ్ సిరి కొండతో విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

జ)నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. బెంగళూరులో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను. తరువాత సినిమా ఇండస్ట్రీపై మక్కువతో ‘కొంచం ఇష్టం కొంచం కష్టం’ సినిమాకు రచయితగా పనిచేశాను. అలాగే ‘ఠాగూర్’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాక కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ విభాగంలో వర్క్ చేశాను. డైరెక్షన్ ట్రైయిల్స్ లో ఉన్నప్పుడు ఈ సినిమాకు పని చేసే అవకాశం లభించింది.

ప్ర) టచ్ చేసి చూడు గురించి ?

జ) వక్కంతం వంశీ ఈ సినిమా కథ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టోరీని అందంగా తెరమీద చూపించడం జరిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

ప్ర) మీ హీరో రవితేజ గురించి ?

జ) ‘మిరపకాయ’ సినిమా నుండి రవితేజతో మంచి అనుబంధం ఉంది. ఆయనకు ఈ లైన్ చెప్పగానే నచ్చి ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నాడు. తొంభై ఆరు రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయడం జరిగింది.

ప్ర) హీరోయిన్స్ రాశిఖన్నా , సీరత్ కపూర్ గురించి చెప్పండి ?

జ) ఇద్దరి పాత్రలు ఈ సినిమాకు కీలకం. నేను ఇచ్చిన రోల్స్ లో వారు చక్కగా నటించారు. సినిమా విడుదల తరువాత ఇద్దరికీ మంచి పేరు లభిస్తుంది.

ప్ర) బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతంను తీకుకోవడానికి కారణం ?

జ) సినిమాకు ఫ్రెష్ మ్యూజిక్ కావాలనుకున్నాను. అందుకే వారిని సంప్రదించాను. స్క్రిప్ట్ వినగానే ఆతను ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు.

ప్ర) సినిమా నిర్మాతల సహకారం ఎలాంటిది ?

జ) నిర్మాత బుజ్జి గారితో ‘లక్ష్మి’ సినిమా నుండి ట్రావెల్ అవుతున్నాను. ఆయన వక్కంతం వంశీ స్టోరీ వినమని చెప్పడంతో విన్నారు. విన్నాక నచ్చి ఈ సినిమా మొదలుపెట్టారు. మరో నిర్మాత వల్లభనేని వంశీ మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. చాలా బాగా సహకరించారు.

ప్ర) తదుపరి సినిమాలు ?

జ)ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాను. ఈ సినిమా విడుదల తరువాత మరో సినిమాకు స్క్రిప్ట్ రాస్తాను.