భారీ షెడ్యూల్ కి సిద్ధమవుతోన్న ‘టచ్ చేసి చూడు’ !
Published on May 27, 2017 12:21 pm IST


మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం టచ్ చేసి చూడు షూటింగ్ జోరుగా సాగుతోంది. విక్రమ్ సిరి కొండ దర్శకత్వంలో ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

కాగా ఈచిత్ర తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దీని తరువాత జూన్ 5 నుంచి మరో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు.ఈ షెడ్యూల్ పాండిచ్చేరిలో జరగనుంది. 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ ఫైట్ సీన్ మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రాశి ఖన్నా,సీరత్ కపూర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ లు నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook