ఆ విషయంలో ‘బాహుబలి-2’కి పోటీ ఇస్తున్న ‘కాటమరాయుడు’ !


పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కాటమరాయుడు’ చిత్ర ట్రైలర్ నిన్న రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ పూర్తి పంచెకట్టుతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్న ఈ ట్రైలర్ అభిమానులకు కనువిందు చేస్తోంది. విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ఈ ట్రైలర్ మిలియన్ మార్కును దాటేసింది. అంతేగాక ట్రైలర్ లైక్స్ విషయంలో అయితే ‘బాహుబలి-2’ కి పోటీ ఇస్తోంది.

‘బాహుబలి-2’ తెలుగు ట్రైలర్ ఈ 15నెల వ తారీఖున విడుదలై పూర్తిగా నాలుగు రోజులు గడుస్తుండగా సుమారు 5.8 లక్షల లలైక్స్ దక్కించుకోగా ‘కాటమరాయుడు’ ట్రైలర్ 24 గంటలు కూడా గడవక ముందే 1. 4 లక్షల లైక్స్ పొందింది. రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీ రాబోయే నాలుగు రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలని సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏమైనా బాహుబలి లాంటి నేషనల్ లెవెల్ సినిమాకి కాటమరాయుడు పోటీగా నిలవడమంటే విశేషమే మరి. దర్శకుడు డాలి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ మార్చి నెల 24న రిలీజ్ కానుంది.