రాకింగ్ స్టార్ యష్ తన బాక్సాఫీస్ స్టామినా మరోసారి నిరూపించుకున్నాడు. ఆయన నటించిన ‘టాక్సిక్’ చిత్రం తొలి రోజే హిందీ నెట్ వసూళ్లలో ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో నార్త్ బెల్ట్‌లో కొత్త రికార్డులను సృష్టించనుంది.
గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ఉత్తరాదిన ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. యష్ మాస్ క్రేజ్, స్టైలిష్ ప్రెజెంటేషన్ హిందీ బెల్ట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో మొదటి రోజే ఈ స్థాయి వసూళ్లు నమోదు కానుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమాలో బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా లతో పాటు నయనతార, రుక్మిణి వసంత్ నటించడంతో ఈ మూవీపై అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. మున్ముందు ఈ సినిమా నార్త్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
