కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ బిగ్ థింగ్ సినిమానే “టాక్సిక్”. వరల్డ్ క్లాస్ లెవెల్లో తన దగ్గర రెండు భారీ సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో ఒకటి ఈ టాక్సిక్ కాగా మేకర్స్ ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. అయితే విడుదల అనుకున్న సమయానికి జరగలేదు కానీ వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ సినీ ప్లాట్ ఫామ్ లలో ఒకటైన సినిమా కాన్ ఈవెంట్ లో ఈ సినిమాకి చోటు దక్కింది.
ఎన్నో హాలీవుడ్ సినిమాల ఎక్స్ క్లూజివ్ కంటెంట్ తో పాటుగా టాక్సిక్ సినిమా తాలూకా కంటెంట్ కూడా పడిందట. అక్కడ సినిమా తాలూకా 9 నిమిషాల ఎక్స్ క్లూజివ్ స్పెషల్ కంటెంట్ ని మేకర్స్ సినీ ప్రముఖులకు చూపించగా వారు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. అయితే టాక్సిక్ ఇంగ్లీష్ రిలీజ్ కి ఇది ఒకింత బూస్టప్ కూడా కావచ్చని చెప్పాలి. మరి ఈ స్టెప్ తర్వాత టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ కి ఏమన్నా ప్లస్ అవుతుందా లేదా అనేది చూడాల్సిందే. ఈ భారీ సినిమాని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.
