భారీగా పడిపోయిన ‘టాక్సిక్’ ఓటీటీ డీల్? అదే సంస్థకు మరో ‘జన నాయగన్’లా..!

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ యష్ హీరోగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారాసుతార, నయనతార హీరోయిన్స్ గా దర్శకురాలు గీతం మోహన్ దాస్ తెరకెక్కించిన రీసెంట్ భారీ చిత్రమే టాక్సిక్. విడుదలకు ముందు మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా అలా వాయిదా పడుతూ వచ్చి మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. కానీ సినిమా విడుదల తర్వాత ఆడియన్స్ నుంచి టాక్ రివర్స్ రావడంతో ఇండియన్ సినిమా హిస్టరీ దగ్గర భారీ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచిపోయింది.

అయితే మేకర్స్ ఈ సినిమాని ఎలాంటి ఓటేటి డీల్ పూర్తి చేయకుండానే దియేటర్స్ లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే సినిమా విడుదల కంటే ముందు వచ్చిన ఓటీపీ ఆఫర్ ఇప్పుడు సినిమా ఫలితం తర్వాత దారుణంగా పడిపోయినట్టు టాక్ వైరల్ గా మారింది. సినిమా విడుదలకు ముందు 150 కోట్లు మేర ఆఫర్ వస్తే ఇప్పుడు కేవలం 30 కోట్లే ఈ సినిమాకు వస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇది మాత్రం ఒక ఊహించని షాక్ అనే అనుకోవాలి. ఇంట్రెస్టింగ్ గా ఇదే సినిమా నిర్మాణ సంస్థ కేవిఎన్ వారి గత చిత్రం జననాయగన్ కూడా ఇలాంటి పరిస్థితిని చూడాల్సి వచ్చింది. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా విడుదలకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియోతో 100 కోట్లకు పైగా డీల్ చేసుకుంది.

కానీ పలు వాయిదాలు సినిమా హైట్ కూడా తగ్గడంతో వారు తప్పుకొని డీల్ వదులుకున్నారు తర్వాత ఆ సినిమా 50 కోట్ల మేర వచ్చింది. పైగా జీ 5కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లోనే టాక్సిక్ కూడా ఉందని చెప్పొచ్చు. మరి టాక్సిక్ ఓటీటీ పార్ట్నర్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version