గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. కాగా హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నటి రుక్మిణి వసంత్, ఈవెంట్ ని ఘనంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చూపిన ఉత్సాహభరితమైన స్పందనను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలుగు ప్రేక్షకుల నుండి తనకు లభించే ప్రేమ తనకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా చేస్తుందని ఆమె అన్నారు.
ఇక టాక్సిక్ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలో మారిచిపోలేని అనుభూతి అని, లైఫ్ లో ఒక్కసారైనా ఆ అనుభూతిని పొందాలని రుక్మిణి తెలిపింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే లాంగ్ రన్ చాలా కీలకం. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి తారలు నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతు మోహన్‌దాస్ తెరకెక్కించారు.
