యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఫైనల్ రన్‌లో దాదాపు 200 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇది సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో పాటు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుండటంతో సినిమాకు తొలి రోజుల్లోనే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుప్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
