అక్షయ్ కుమార్ అవైటెడ్ రీమేక్ ట్రైలర్, సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్

అక్షయ్ కుమార్ అవైటెడ్ రీమేక్ ట్రైలర్, సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్

Published on Jun 14, 2024 4:00 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “బడే మియా చోటే మియా”. ఓటిటిలో కూడా వచ్చేసింది. అయితే ఈ చిత్రం తర్వాత అక్షయ్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఉన్నప్పటికీ వాటిలో తన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమే “సఫారీయా”. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర స్టార్ హీరో సూర్యతో తెరకెక్కించిన “ఆకాశం నీ హద్దురా” కి రీమేక్ గా హిందీలో అక్షయ్ తో ఆమె చేస్తుంది.

అయితే దీనిపై కూడా మంచి బజ్ నెలకొనగా లేటెస్ట్ గా ఈ సినిమా అవైటెడ్ రిలీజ్ డేట్ ని అయితే అక్షయ్ రివీల్ చేసాడు. మరి దీనితో ఈ చిత్రం ఈ జూలై 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా దీని తాలూకా థియేట్రికల్ ట్రైలర్ ని ఈ జూన్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా రివీల్ చేసాడు. మరి అక్షయ్ ఎలాంటి నటుడు అనేది అందరికీ తెలిసిందే. దీనితో ఈ సాలిడ్ ఎమోషనల్ డ్రామాలో ఎలా నటిస్తాడు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మొదట ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు