విక్రమ్ ‘ధృవ నచ్చతిరమ్’ ట్రైలర్ ఆ రోజున విడుదల కానుందా?

Published on Jun 8, 2023 2:00 am IST

చియాన్ విక్రమ్ ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన భారీ సినిమాలు పొన్నియన్ సెల్వన్ రెండు భాగాల్లో ఆదిత్య కరికాలుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఆ సినిమాలు రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకుని ఆయనకు మరింత మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పా రంజిత్ తో తంగలాన్ మూవీ చేస్తున్నారు విక్రమ్. ఇక ఆయన నటించిన మరొక సినిమా ధృవ నచ్చతిరమ్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ స్పై థ్రిల్లర్ సినిమా జులై 14న విడుదల కానుందని సమాచారం.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 17న విడుదల చేయనున్నట్టు తమిళ ఫిల్మ్ సర్కిల్స్‌లో మరొక వార్త వినిపిస్తోంది. అలాగే ట్రైలర్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని తదితరులు ధృవ నచ్చతిరమ్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ ఎత్తున గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :