‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ ప్లాన్ మారింది.!

1st, December 2016 - 02:02:41 PM

gpsk
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని అంచనాలను పెంచేసింది. ఇక సినిమా విడుదలకు నెలరోజుల ముందే ప్రమోషన్స్ చేపట్టాలన్న ఆలోచనతో టీమ్ ట్రైలర్, ఆడియో విడుదల వేడుకలను డిసెంబర్ 9, 16న నిర్వహించనున్నట్లు తెలిపింది.

కాగా తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ మార్చేసినట్లు తెలుస్తోంది. ముందే ప్రకటించినట్లుగా డిసెంబర్ 9నే ట్రైలర్ విడుదల చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. ఆడియో విడుదల జరగనున్న డిసెంబర్ 16నే, తిరుపతిలో పెద్ద ఎత్తున జరిగే వేడుకలోనే ట్రైలర్ విడుదలను చేపట్టనున్నట్లు తెలిసింది. క్రిష్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్‌గా నటించారు. శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో భారీ ఫైట్స్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చేలా ఉంటాయట!