‘నాని’ దసరా టీజర్ కి ట్రమెండస్ రెస్పాన్స్

‘నాని’ దసరా టీజర్ కి ట్రమెండస్ రెస్పాన్స్

Published on Jan 30, 2023 11:30 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్ మూవీ దసరా. యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మొదటి నుండి కూడా అందరిలో ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న దసరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయి అందరిలో మంచి అంచనాలు ఏర్పరచగా నేడు ఈ మూవీ యొక్క టీజర్ ని ఐదు భాషల్లో రిలీజ్ చేసారు. కాగా ఈ టీజర్ కి అన్ని భాషల ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది.

ముఖ్యంగా నాని మాస్ స్టైల్ యాక్షన్, రస్టిక్ విజువల్స్, కీర్తి సురేష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని కూడా టీజర్ లో అదిరిపోవడంతో ముఖ్యంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి దసరా టీజర్ కి మరింత మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ మూవీని వేసవి కానుకగా మార్చి 30న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు