వైరల్ : “RRR” పై ఎగ్జైట్ అయ్యిన “ట్రాన్స్ఫార్మర్స్” నటుడు.!

Published on Jun 9, 2023 10:00 am IST


మన టాలీవుడ్ ప్రైడ్ భారీ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కి ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పోయాయి. ఎలాంటి తారతమ్యాలు లేకుండా హద్దులు చెరిపేసి ప్రపంచ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఇంప్రెస్ చేసిన జక్కన్న వర్క్ వరల్డ్ వైడ్ మరింత గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక రీసెంట్ గా అయితే ఈ చిత్రంపై స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హోలాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా.

లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన భారీ చిత్రం “ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్” నటుడు, హాలీవుడ్ మ్యూజిక్ ర్యాపర్ టోబే న్యిగ్యి ఇండియా ప్రమోషన్స్ లో అయితే RRR పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాను RRR చిత్రాన్ని చూశానని ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది అని ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యాడు.

అంతే కాకుండా సినిమాలో స్టోరీ గాని ఇతర అన్ని ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా అనిపించాయని చెప్పాడు. అయితే తాను నాటు నాటు డాన్స్ మాత్రం ట్రై చెయ్యలేదని అది నా వాళ్ళ కాదని నవ్వుతూ చెప్పేసాడు. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :