‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ కి ట్రమెండస్ రెస్పాన్స్ …!

Published on Oct 1, 2022 1:17 am IST


టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, మురళి శర్మ, సముద్ర ఖని, సునీల్ కీలక పాత్రలు చేయగా ఒక ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ పై మొదటి నుండి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో పాటు మూవీ పై భారీ స్థాయి హైప్ క్రియేట్ చేసాయి. ఇక మొన్న రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ థియేట్రికల్ ట్రైలర్ ఇంకా యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లోనే ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కి 13 మిలియన్ వ్యూస్ లభించాయి. కాగా తమ మూవీ టీజర్ కి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న గాడ్ ఫాదర్ యూనిట్, తప్పకుండా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న మూవీ కూడా అందరినీ అలరించి మంచి సక్సెస్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :