మొదటి పాటతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ‘ప్రేమమ్’

premam
ప్రేమ కథ అనగానే సినీ ప్రియులందరికీ మలయాళ సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రం ‘ప్రేమమ్’ కళ్ళ ముందు కదలకుండా ఉండదు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆ చిత్రాన్ని తెలుగు యంగ్ హీరో ‘నాగ్ చైతన్య’ దర్శకుడు ‘చందూ మొండేటి’ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. మొదట ఇది వర్కవుట్ కాదని అందరూ అనుకున్నారు, ‘నివిన్ పౌలీ’ పాత్రకు ‘చైతు’ సరిపోడని కూడా కామెంట్ చేశారు. కానీ విడుదలైన ఫస్ట్ లుక్స్ ఆ అపోహను తొలగించాయి.

చైతూ మేకోవర్ పట్ల పాజిటివ్ స్పందన లభించింది. పైగా ఈరోజు ఉదయం ‘నాగ చైతన్య’ చేతుల మీదుగా విడుదలైన మొదటి పాట ‘ఎవరే’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అచ్చమైన తెలుగు సాహిత్యం, వరిజినల్ వెర్షన్ లో ఉన్నట్టే ఉన్న సంగీతం అన్నీ కలిసి మలయాళ ప్రేమమ్ పాట ‘మలరే’ విన్నప్పుడు కలిగే అనుభూతిని కలిగిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం స్సాదించి చైతు కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే టాక్ వినబడుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో చైతు సరసన ‘శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్’ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.