‘పుష్ప 2’లో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్?

‘పుష్ప 2’లో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్?

Published on Dec 19, 2022 5:42 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ‘పుష్ప 2’ పైనే బన్నీ – సుకుమార్ తమ ఫుల్ ఫోకస్ పెట్టారు. కాగా ‘పుష్ప 2’ లో మరో కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. నిజానికి హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రంలో నటించబోతుంది అంటూ గతంలో కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే, సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తోందా ?, లేదా ? అని చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ.. పుష్ప 2 లో ఓ గిరిజన యువతి పాత్ర చాలా కీలకం కాబోతుందట.

ఇప్పుడు ఈ పాత్రలో సాయి పల్లవి అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ సాయి పల్లవి ఈ పాత్రలో నటించకపోతే.. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మరి పుష్ప 2 లో గిరిజన యువతిగా కనిపించే ఆ నటి ఎవరో కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. కానీ, బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు