ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా చేసిన చిత్రం ఈ కథ కంచికి మనం ఇంటికి – హీరో త్రిగుణ్

Published on Apr 7, 2022 4:00 pm IST

ఏప్రిల్ 8 న థియేటర్ల లో కథ కంచికి మనం ఇంటికి సినిమా రిలీజ్ అవ్వడం సంతోషం గా ఉంది. కొత్త సంవత్సరం ఉగాది తర్వాత విడుదల అవుతున్న తొలి చిత్రం. చీకటి గదిలో చితక్కొట్టుడు తర్వాత చేస్తున్న చిత్రం ఇది. అయితే హార్రర్ కామెడీ జోనర్ లో మరో సినిమా చేయాలని ఉంది. ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా చేసిన చిత్రం ఈ కథ కంచికి మనం ఇంటికి.

కథ చిత్రం తో నా కెరీర్ ను స్టార్ట్ చేశా. అందరి సపోర్ట్ లక్ తో చేశా ఆ చిత్రం. ఇన్ని రోజుల తర్వాత, కోవిడ్ తర్వాత వస్తుండటం తో చాలా కొత్తగా ఉంది. త్రిగుణ్ చిత్రాలు అంటే, 24 కిస్సెస్, WWW, కొండ, కథ కంచికి మనం ఇంటికి ఇలా డిఫెరెంట్ గా ఉంటున్నాయి.

ఇది ఏ కథకనా సెట్ అవుతుంది. చిన్న జానపదం లా డైరెక్టర్ చెప్పారు. వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేసేది ఎంటి అంటే RRR లో ఒక కమర్షియాలిటీ. తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది.

హార్రర్ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే కొత్తగా ఉంటుంది. సినిమాలో డైరక్టర్ అవ్వాలనుకునే ఒక హీరో కాన్సెప్ట్ నచ్చడం, ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది. టీమ్ చాలా బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేశాం. భీమ్స్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ చెప్పాలి ఎలా ఉంది అనేది.

ఈ సినిమా చేయకపోతే కొండ వచ్చేది కాదు. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అమీర్ ఖాన్ నాకు ఇన్స్పిరేషన్. ప్రమోట్ చేయడానికి చాలా ఇన్స్పిరేషన్. చాలా కొత్తగా జనాలకు రీచ్ అయ్యేలా నా జాబ్ నేనే చేశా. కంటెంట్ బాగుంటే, కాశ్మీర్ ఫైల్స్ లా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. శాటిలైట్ రైట్స్, ఓటిటి వల్ల లాస్ కూడా ఏం ఉండదు అని అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :