జయం రవి సినిమాలో త్రిష క్లాస్.. అంజలి మాస్..!

trish-anjali
త్రిష హవా తగ్గిపోయింది అనే వ్యాఖ్యలు వినిపించిన ప్రతిసారి కొత్త సినిమాకు సంతకాలు పెడుతూ అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. మరో తమిళ సినిమాలో నటించడానికి త్రిష అంగీకరించింది. సురాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్న సినిమాలో త్రిషను ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారు. అంజలి మరొక హీరోయిన్.

ఈ సినిమాలో అంజలి గ్రామీణ యువతి పాత్ర పోషిస్తుంది. మాస్ క్యారెక్టర్ అని సమాచారం. మరొక హీరోయిన్ త్రిష సిటీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఫుల్ క్లాస్ క్యారెక్టర్లో గ్లామర్ ఒలకబోసే పాత్రలో నటిస్తుంది. అంజలి, జయం రవి పాల్గొనగా చాలా వరకు సన్నివేశాలను షూట్ చేశారు. ఒక పాట, మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయవలసి ఉంది. త్రిష ఆగస్ట్ 10న ప్రారంభమయ్యే షెడ్యూల్లో చిత్రబృందంతో కలుస్తుంది.

Exit mobile version