ప్రమాదకరమైన పనులు చేస్తున్న త్రిష !


తమిళ పరిశ్రమలో దశాబ్ద కాలం పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష ప్రస్తుతం గ్లామర్ రోల్స్ కు చెక్ పెట్టి కథాపరమైన, హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలనే చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. వీటిలో ‘గర్జనై’ కూడా ఒకటి. హిందీ ‘ఎన్హెచ్ 10’ కి తమిళ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఆమె పాత్ర చుట్టూనే సినిమా మొత్తం నడవనుంది.

ఈ సినిమాని చాలా సీరియస్ గా తీసుకున్న త్రిష చిత్రీకరణ కోసం చాలా కష్టపడుతోందట. ఆమెపై నడిచే పోరాట సన్నివేశాలను డూప్ లేకుండా స్వయంగా ఆమే చేస్తోందట. ముందుగా దర్శకుడు సుందర్ బాలు ఆ రిస్కీ స్టంట్స్ ను డూప్ ను ఉపయోగించి చేద్దామన్నా కూడా త్రిష ఒప్పుకోలేదట. పైగా ఎంతో అనుభవజ్ఞురాలిలా ప్రతి స్టంట్ ను జాగ్రత్తగా, చాలా పర్ఫెక్షన్ తో చేస్తోందని, ఆ డెడికేషన్ వలనే ఆమె ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారని సుందర్ బాలు అన్నారు.