బాలయ్య కోసం బరువు పెరుగుతున్న హీరోయిన్ ?

బాలయ్య కోసం బరువు పెరుగుతున్న హీరోయిన్ ?

Published on Aug 30, 2021 6:55 AM IST


నటసింహం బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక త్రిష ఈ సినిమాలో ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్రలో నటిస్తోందట. భార్య పాత్ర కాబట్టి.. కాస్త బరువు పెరిగితే బాగుంటుందని దర్శకుడు కోరాడట.

దాంతో, త్రిష ప్రస్తుతం బరువు పెరిగే పనిలో ఉందట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి మొదట ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను అనుకున్నారు. మలినేని గోపీచంద్ ఆమెకు కథ కూడా చెప్పాడు. కానీ శృతి హాసన్ అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు