‘పొన్నియన్ సెల్వన్’ నుండి త్రిష ట్రెమెండస్ లుక్ రిలీజ్ …!!

‘పొన్నియన్ సెల్వన్’ నుండి త్రిష ట్రెమెండస్ లుక్ రిలీజ్ …!!

Published on Jul 7, 2022 5:02 PM IST

కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్. ప్రస్తుతం ఈ మూవీ మొదటి భాగం చిత్రీకరణ ఎంతో గ్రాండ్ లెవెల్లో జరుగుతోంది. ఇండియాలోని మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన పొన్నియన్ సెల్వన్ పై కోలీవుడ్ సహా భారత దేశంలోని అన్ని భాషల ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

పలు భాషలకు చెందిన దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి క్రేజ్ లభించగా నేడు నటి త్రిష పోషిస్తున్న కుందవాయి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఒంటి నిండా నగలతో ఆకట్టుకునే లుక్ లో కుందవాయి గా త్రిష అదిరిపోయారని అంటున్నారు ప్రేక్షకాభిమానులు. అత్యున్నత సాంకేతిక విలువలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు మణిరత్నం తీస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు