అనీల్ రావిపూడి – వెంకటేష్ మూవీ లో త్రిష…క్లారిటీ ఇదే!

అనీల్ రావిపూడి – వెంకటేష్ మూవీ లో త్రిష…క్లారిటీ ఇదే!

Published on Feb 24, 2024 2:30 AM IST


స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి చివరిగా భగవంత్ కేసరి మూవీ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ డైరెక్టర్ తదుపరి స్టార్ హీరో వెంకటేష్ తో సినిమా చేయనున్నారు. F2, F3 చిత్రాలతో వీరు ఆడియెన్స్ ను బాగా అలరించారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా త్రిష నటించనుంది అంటూ పలు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ మరియు త్రిష కాంబినేషన్ లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బాడీగార్డ్, నమో వెంకటేశ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు ఆడియెన్స్ ను బాగా అలరించాయి.

ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కానుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఎలాంటి వాస్తవం లేదు. ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు అని చెప్పాలి. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. త్రిష ఇటీవల లియో చిత్రం తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. త్రిష తదుపరి చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వంభర లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు