జంటగా వెళ్ళిన త్రిష, రానా

rana-trisha
మలేసియాలో జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా 2014) వేడుకకు దగ్గుబాటి రానా, త్రిష ఒకే ఫ్లైట్ లో కలసి వెళ్ళారు. వీరిద్దరూ కలసి దిగిన సెల్ఫి ఫోటోను త్రిష, రానాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఇంటర్నెట్ లో విపరీతమైన స్పందన లభించింది.

రానా, త్రిషల జంట చూడముచ్చటగా ఉంది అంటూ కొందరు, క్యూట్ పెయిర్.. మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడూ..? అంటూ మరి కొందరు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ స్టార్స్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని గాసిప్స్ మీడియాలో షికారు చేస్తున్నాయి. మా ఇద్దరి మధ్య అటువంటిది ఏం లేదు, మేం మంచి స్నేహితులు మాత్రమే అని త్రిష, రానా క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లు ఆగడం లేదు.

తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తున్న ఈ ఇద్దరు స్నేహితులు… ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలసి నటించకపోవడం విశేషం. ఓ అభిమాని వీరిద్దరూ కలసి నటిస్తే చూడాలని ఉందంటూ పోస్ట్ చేశాడు. వీరిద్దరి క్రేజ్ క్యాష్ చేసుకునే దర్శకనిర్మాతలు ఎవరో..?

Exit mobile version