స్టార్ హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్..!

Published on Jan 8, 2022 1:02 am IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. కరోనా నియమాలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఏడాది ఆరంభంలోనే నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని చెప్పుకొచ్చింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయని కానీ వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు.

అయితే వాక్సిన్ తీసుకోవడం వలన ఈరోజు నేను బావున్నానని, దయచేసి అందరు వాక్సిన్ వేయించుకోవాలని త్రిష విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ టెస్టులు చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాననని, నా కోసం ప్రార్దించిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ త్రిష చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :