త్రివిక్రమ్ కోసం కొత్త లుక్ లో.. !

త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చెయ్యటానికి సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నుండి నుండి ఈ సినిమా షూట్ కి వెళ్ళబోతుందట. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట.

ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒప్పటి హాట్ హీరోయిన్ టబును తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడట. అందుకు తగ్గట్లుగానే కొత్త లుక్ కోసం బన్నీ తన లుక్ ను మార్చనున్నాడు.

Exit mobile version