చిరు త్రివిక్రమ్ కాంబో లో సినిమా…త్వరలో ప్రకటన!

Published on Nov 7, 2021 8:25 pm IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఆచార్య చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారు అంటూ గతం లో పలుమార్లు చర్చలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మరొకసారి ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మెగాస్టార్ చిరంజీవి కి సంబందించిన ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాబోయే కొద్ది వారాల్లో ఈ చిత్రం కి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం వహించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More