దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే భారీ మైథలాజికల్ చిత్రం పై కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ పై ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవుడిగా నటుస్తున్నారు. పైగా ‘శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు సుబ్రహ్మణ్య స్వామి’’ పాత్రలో తారక్ నటిస్తున్నాడు. అందుకే, ఎన్టీఆర్ లుక్ పై స్పెషల్ విఎఫ్ఎక్స్ చేపించేలా త్రివిక్రమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ తాలూకు వర్క్ పైనే విఎఫ్ఎక్స్ టీమ్ తో త్రివిక్రమ్ కూర్చున్నాడట.
ఇక ఎన్టీఆర్ కి భుజం గాయం కారణంగా షూటింగ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. ఈ మధ్యలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ బెటర్ మెంట్స్ పై వర్క్ చేశారు. అన్నట్టు తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ భారీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా కావడం, పైగా తారక్ కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు ఉండటం, అన్నిటికీ మించి మైథలాజికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. త్రివిక్రమ్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా.
కాగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం
