‘త్రివిక్రమ్, నాని’ సినిమా నిజమేనా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నాచ్యురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ చిత్రం తెరకెక్కటం ఇప్పట్లో సాధ్యమయేలా కనిపించట్లేదు. త్రివిక్రమ్ గతంలోనే నానితో సినిమా చేద్దామనుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దగ్గరనుంచి ఆ చిత్రానికి సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సారి కూడా అలాగే జరగనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే విక్టరీ వెంకటేష్ తో ఓ చిత్రం చెయ్యబోతున్నారు.

ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క కూడా త్రివిక్రమ్ ఎప్పుడో పూర్తి చేశారు. కానీ ‘అరవింద సమేత’ పూర్తి చేసుకొని ఆ చిత్రం నుండి బయటకు రావడానికి త్రివిక్రమ్ కు మరో ఆరు ఏడు నెలలు పడుతుంది. ఆ తర్వాత వెంకీ చిత్రం మొదలుపెట్టి పూర్తిచేసే సరికి సంవత్సరం పడుతుంది. ఇకప్పటి పరిస్థితులను బట్టి ‘త్రివిక్రమ్, నాని’ సినిమా ఆధారపడి ఉంటుంది.

అయితే ‘త్రివిక్రమ్, నాని’ కలిసి సినిమా చేస్తే.. ప్రేక్షకుల్లో ఆ చిత్రం పై భారీ అంచనాలే ఉంటాయి. త్రివిక్రమ్ పంచ్ పవర్ కి నాని కామెడీ టైమింగ్ తోడైతే, ఒక మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రావడం పక్కా. మరీ ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే.

Exit mobile version