మహేష్ తో త్రివిక్రమ్ రాజకీయం.. నిజమేనా ?

Published on Jul 10, 2022 10:09 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇది రాజకీయ డ్రామా అని, ప్రస్తుత రాజకీయాల పై త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేశాడని తెలుస్తోంది. సినిమాలో చాలా సీన్స్ చాలా ప్రాక్టికల్ గా ఉంటాయట. రాజకీయం ఓ వ్యాపారంగా ఎలా మారంది ?, దీని వల్ల సమాజం ఏం కోల్పోతుంది ? అనే కోణంలో ఈ సినిమా స్క్రిప్ట్ సాగుతుందట.

మహేష్ పాత్ర ద్వారా త్రివిక్రమ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనే కీలకమైన ఇంటర్వెల్ పార్ట్ షూటింగ్ ను ఆగస్టు సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :