అక్టోబర్ లో మహేష్ బాబుని డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్
Published on Sep 28, 2016 8:54 am IST

trivikram-mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వీరి కలయికలో వచ్చిన ‘అతడు, ఖలేజా’ చిత్రాలు ఇప్పటికీ టీవీ చానళ్ల టిఆర్పీ రేటింగ్స్ ను కాపాడుతున్నాయంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తరువాత ఆయనను డైరెక్ట్ చేయబోయే దర్శకుల్లో త్రివిక్రమ్ పేరు కూడా ఉంది. కానీ మురుగదాస్ సినిమా చేసేలోపే త్రివిక్రమ్ మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్నాడు.

అయితే అది సినిమా కాదులెండి ఓ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. మహేష్ ఈ మధ్య ఓ ఆన్ లైన్ టికెటింగ్ కంపీనీతో అడ్వర్టైజింగ్ డీల్ కుదుర్చుకున్నాడు. సదరు కంపెనీ మహేష్ బాబుతో యాడ్ డైరెక్ట్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ వద్దకు వెళ్లారట. త్రివిక్రమ్ కూడా వాళ్ళకే ఓకే చెప్పేశాడట. ఈ యాడ్ షూట్ అక్టోబర్ మొదటివారంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరగనుంది. గతంలో కూడా త్రివిక్రమ్ మహేష్ తో పలు కమర్షియల్ యాడ్ లను డైరెక్ట్ చేశారు. ఇకపోతే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందా ? ఉంటే ఎప్పుడు ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook