త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ !

నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. గతంలో త్రివిక్రమ్ వెంకటేష్ యొక్క ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి సినిమాలకు రచయితగా పనిచేసినా ఆయన్ను డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమా ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే త్రివిక్రమ్ ఇప్పటికే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమాను పూర్తిచేయగా ఈ మధ్యే ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాని లాంచ్ చేశారు. దీంతో ఇది ఆయన వరుసగా మూడో సినిమా కానుంది. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరోవైపు వెంకీ కూడా తేజతో ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.