ప్రభాస్ తో త్రివిక్రమ్ మాసివ్ ప్రాజెక్ట్.?

Published on May 27, 2023 11:09 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ ఇపుడు అనేక సినిమాలకు ఒకే చేసి ఆల్రెడీ కొన్ని రిలీజ్ కి కొన్ని షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నాయి. అంతే కాకుండా ఇంకా ఒకే చేయాల్సిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక ఈ లైనప్ లో అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ రూమర్ ఒకటి బయటకి వచ్చింది.

ప్రభాస్ తో ఇప్పుడు మాటల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు తాను గాని ప్రభాస్ గాని చేయని ఓ సరికొత్త సబ్జెక్టు అయితే డార్లింగ్ కి నరేట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ అయితే మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :