స్టార్ హీర విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎక్కడా బ్రేకులు లేకుండా పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ 2న విడుదలే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వేసవి నుంచే ప్రమోషనల్ అప్డేట్స్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ, ఇందులో వింటేజ్ త్రివిక్రమ్ మార్క్ ఫన్‌తో పాటు సాలిడ్ యాక్షన్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమా కథా గమనం గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంటర్వెల్ వరకు ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహాలో ఎంటర్టైనింగ్గా సాగి, ఒక్కసారిగా ‘అతడు’ లెవల్ యాక్షన్ మోడ్‌లోకి మారుతుందట. టైటిల్ కింద ఉన్న AK 47 క్యాప్షన్‌కు తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ ఉండబోతోందని తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ‘అల వైకుంఠపురములో’ ప్లస్ ‘అతడు’ మిక్సింగ్‌కు వెంకీ టైమింగ్‌ను జోడించి ఒక పర్ఫెక్ట్ అవుట్‌పుట్‌ను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్ కెరీర్‌కు కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకం. దీని తర్వాత ఆయన చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బజ్ పెరగాలంటే ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
