రష్మిక పై బ్యాన్ అంటూ పుకార్లు … అసలు డీటెయిల్స్ ఇవే

రష్మిక పై బ్యాన్ అంటూ పుకార్లు … అసలు డీటెయిల్స్ ఇవే

Published on Nov 26, 2022 2:00 AM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి అవకాశాలతో నటిగా దూసుకెళ్తున్న యువ భామ రష్మిక మందన్న. ఇటీవల సరిలేరు నీకెవ్వరు, పుష్ప, భీష్మ, సీతారామం వంటి భారీ సక్సెస్ లతో మంచి క్రేజ్ అందుకున్న ఆమె ప్రస్తుతం తెలుగుతో పాటు అటు కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లో సైతం చేస్తున్నారు. అయితే ఇటీవల రెండు రోజులుగా రష్మిక మందన్న పై కొన్ని పుకార్లు ప్రచారం అవుతున్నాయి. ఆమెను కన్నడ చిత్ర పరిశ్రమ నుండి బ్యాన్ చేయనున్నారని కొందరు ఈ ప్రచారాలు చేస్తున్నారు.

జరిగిందేంటంటే, కొద్దిరోజుల క్రితం తన ఫస్ట్ కన్నడ మూవీ కిరిక్ పార్టీని నిర్మించిన పరంవా బ్యానర్ పేరుని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె ఉచ్చరించలేదని, అలానే లేటెస్ట్ గా రిలీజ్ అయిన కాంతారా మూవీ కూడా తాను బిజీగా ఉండడం వలన ఇంకా చూడలేదని ఆమె వెల్లడించినందువలన, ఆమెకు తన సొంత భాషలో భారీ సక్సెస్ అయిన సినిమా చూడడానికి తీరిక లేదా, అలానే చేసిన ఫస్ట్ సినిమా యొక్క బ్యానర్ పేరు కూడా ఉచ్చరించలేరా అంటూ కొందరు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేయడం, ఆపైన ఆమెను కన్నడ చిత్ర సీమ నుండి బ్యాన్ చేస్తున్నారు అంటూ కథనాలు ప్రచారం అవడం జరిగింది.

అయితే ఇదంతా కేవలం కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అని, నిజానికి రష్మిక గారికి కన్నడ చిత్రపరిశ్రమ మీద ఎంతో గౌరవం ఉందని, తాను ఎప్పుడూ ఎక్కడా కూడా ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని, కావాలనే కొందరు ఆమె బ్యాన్ విషయమై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుండడంతో అటువంటివి ఏవి నమ్మవద్దని ఆమె సన్నిహితుల నుండి వెలువడుతున్న సమాచారం. మొత్తంగా ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి వీటిపై రష్మిక మందన్న ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు