విజయ్ ని ట్రోల్ చేసినా.. తన స్టార్ పవర్ ని మెచ్చుకోవాల్సిందే

ప్రస్తుతం మరోసారి ఇండియన్ సినిమా దగ్గర పెద్దగా సినిమాలు లేక మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర డ్రై వాతావరణం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఇండస్ట్రీలో కూడా గత కొన్ని వారాల నుంచి చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్ కాలేదు. జస్ట్ కోలీవుడ్ లో మొన్ననే యాక్షన్ హీరో విశాల్ నటించిన “రత్నం” Vishal Rathnam) రిలీజ్ కి వచ్చింది. కానీ దీనికీ పెద్దగా స్పందన లేదు.

అయితే ఈ టైం లో సరిగ్గా దళపతి విజయ్ తన స్టార్ పవర్ చూపించాడు. తన సెన్సేషనల్ హిట్ చిత్రం “గిల్లీ” రీ రిలీజ్ (Ghilli Re Release) కి రాగా ఈ సినిమాకి ఇండియా లోనే ఏ రీ రిలీజ్ కి రాని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే విజయ్ లుక్స్ పరంగా కానీ తన సినిమాల్లో యాక్షన్, డాన్స్ పరంగా కానీ చాలా ట్రోల్స్ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటాయి. అయినా కూడా తన క్రేజ్ ముందు అవన్నీ దిగదుడుపే అని చెప్పాలి.

అసలు ఓ రీ రిలీజ్ సినిమా 20 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేయడం అనేది పూర్తిగా విజయ్ స్టార్ పవర్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఏదో కొత్త సినిమాల రేంజ్ లో బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఓ పక్క రత్నం సినిమా ఉన్నప్పటికీ గిల్లీ బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీటితో తనపై ఎలాంటి ట్రోల్స్ నెగిటివ్ ఉన్నా కూడా ఈ రేంజ్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చేయడం అనేది మాత్రం దళపతి విజయ్ కే చెల్లింది అని చెప్పవచ్చు. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డుని ఏ రీ రిలీజ్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version