టీఆర్పీ రేటింగ్‌లో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఎన్టీవీ..!

Published on Apr 29, 2022 8:26 am IST

తెలుగులో 24 గంటల పాటు న్యూస్‌ని ప్రసారం చేసే ఎన్నో ఛానెళ్లు ఉన్నా ఖచ్చితత్వం మరియు విలువలను పాటిస్తూ వీక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నది ఉన్నట్టుగా న్యూస్‌ని ప్రెజెంట్ చేస్తూ తనకు తాను తిరుగులేదని నిరూపించుకున్న టీవీ ఛానెల్ “ఎన్టీవీ”. ప్రతిక్షణం-ప్రజాహితం అనే తన స్లోగ‌న్ కు తగ్గట్టుగానే ప్రజలకు తెలియాల్సిన, కావాల్సిన న్యూస్‌ని ప్రసారం చేస్తూ తెలుగు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్న ఎన్టీవీ ఇప్పుడు నెంబర్ 1 న్యూస్ ఛానెల్‌గా దూసుకుపోతుంది.

బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) రేటింగ్స్ ప్రకారం గత 15 వారాలుగా నెం.1 స్థానంలోనే కొనసాగుతున్న ఎన్టీవీ 16వ వారం రేటింగ్స్‌లో కూడా అగ్ర స్థాయిలోనే నిలబడింది. 83 రేటింగ్ పాయింట్లతో ఎన్టీవీ మొద‌టి స్థానంలో ఉండ‌గా, టీవీ9 : 57, వీ6 : 28, టీవీ5 : 26, ఏబీఎన్ : 18, సాక్షి : 16 రేటింగ్ పాయింట్స్‌తో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దాదాపు 4 నెలలుగా నెంబర్ వన్ ఛానెల్‌గా దూసుకుపోతున్న ఎన్టీవీ మున్ముందు కూడా ఈ స్థానాన్ని మరింత పదిలం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది.

సంబంధిత సమాచారం :