పూర్వ వైభవం ఇచ్చిన చిరు..థాంక్స్ టు బాబీ.!

పూర్వ వైభవం ఇచ్చిన చిరు..థాంక్స్ టు బాబీ.!

Published on Dec 31, 2022 9:00 AM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం అయితే ఖచ్చితంగా మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని చూపిస్తున్నట్టుగా బాబీ చెప్పుకొచ్చాడు. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటికే ఎన్నో సార్లు చూపించారు. అయితే నిన్న వచ్చిన పూనకాలు లోడింగ్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రీట్ ని ఇచ్చింది.

ముఖ్యంగా ఈ సాంగ్ లో బాస్ ఎనర్జీ చూస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పడేలా ఉందని చెప్పి తీరాలి. ఇప్పుడు చిరు కి 67 ఏళ్ళు అయినప్పటికీ ఈ ఏజ్ లో కూడా తన రెండు దశాబ్దాల కితం చిత్రాలు జై చిరంజీవ, అందరివాడు, ఠాగూర్ లలో డాన్స్ చేసిన మెగాస్టార్ అయితే మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారని చెప్పాలి.

వారి అభిమానులనులకి అయితే చిరు ని ఇలా చూడడం కన్నా మరో ట్రీట్ ఇంకేం ఉంటుంది. “వాల్తేరు వీరయ్య” సినిమా ఫలితం ఏమో కానీ మెగా ఫ్యాన్స్ కి మాత్రం పూర్వ వైభవాన్ని చిరు ఇచ్చారని చెప్పడంలో సందేహం లేదు. డాన్స్, ఎనర్జీ వరకు వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తున్నారు. ఇక సినిమాలో కామెడీ టైమింగ్ కూడా కరెక్ట్ గ పడితే మెగా ఫ్యాన్స్ కి ఏఈ చిత్రం గుర్తుండిపోతుంది.

పూనకాలు సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు