“సర్కారు వారి పాట” టికెట్ ధరల పెంపు కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి!

Published on May 9, 2022 7:41 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట మే 12, 2022న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సర్కార్ వారి పాటకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. టికెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

30 నుండి 50 రూపాయల వరకు టికెట్ ధరల ను పెంచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లు మరియు మల్టీప్లెక్స్‌లలో ఈ ధరలు ఇలా ఉండనున్నాయి. 7 రోజుల పాటు రోజుకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు. మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఈ స్పేస్‌ని చూస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం :