‘అజ్ఞాతవాసి’ 5 షోలకు అనుమతులిచ్చిన తెలంగాణా ప్రభుత్వం !

‘అజ్ఞాతవాసి’ రేపు రిలీజవుతున్న సందర్బంగా తెలంగాణా రాష్ట్రంలోని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అర్థరాత్రి 1 గంటకు ప్రీమియర్లు లేదా ఈరోజు రాత్రి 9 గంటల 30 నిముషాలకు పెయిడ్ ప్రీమియర్ షోలను వేయాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను విజ్ఞప్తి చేశారు.

కానీ శాంతి భద్రతల దృష్ట్యా అర్థారాత్రి షోలకు అనుమతివ్వడం కుదరదని పోలీస్ శాఖ తెలపడంతో 10వ తేదీ ఉదయం నుండి రెగ్యులర్ గా వేసే 4 రోజులతో పాటు అదనంగా ఒక షోను వేయవచ్చని, అది కూడా ఉదయం 8 గంటలకు వేయాలని అనుమతులిచ్చారు. దీంతో ఇప్పటి వరకు నడుస్తున్న స్పెషల్ షోల సందిగ్దత తొలగిపోయింది.