భీమ్లా నాయక్: నైజాం లో 5 వ ఆటకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

Published on Feb 23, 2022 5:18 pm IST

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. విడుదలకు ముందు, మేకర్స్ ఈరోజు హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్‌కి ముందు ఈ రోజు సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. నైజాంలో రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం మేకర్స్‌కు అనుమతినిచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 5వ షోను మార్చి 11, 2022 వరకు ప్రదర్శించడానికి అనుమతిని మంజూరు చేసింది. దీంతో సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడంతోపాటు, ఈలోగా తెలంగాణలో ఎక్కడ చూసినా టిక్కెట్లు హాట్‌కేక్‌గా అమ్ముడుపోయాయి.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :