సూపర్ స్టార్ “సర్కారు వారి పాట” స్పెషల్ మార్నింగ్ షో ఈ 4 థియేటర్ల లో..!

Published on May 11, 2022 7:36 pm IST


ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాట రిలీజ్ కి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే నైజాం ఏరియా లో ఈ సినిమా కి టికెట్ల ధరల హైక్ తో పాటుగా, అదనపు షో కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ అభ్యర్థన తో స్పెషల్ మార్నింగ్ షో కి అనుమతి ఇవ్వడం జరిగింది.

4:05 గంటల స్పెషల్ మార్నింగ్ షో కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లోని 4 థియేటర్ల కి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. భ్రమరాంబ ధియేటర్ కూకట్ పల్లి, మల్లికార్జున థియేటర్ కూకట్ పల్లి, విశ్వనాథ్ థియేటర్ కూకట్ పల్లి, శ్రీ రాములు థియేటర్ మూసాపేట్ లకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయం పట్ల మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :