‘బాహుబలి’ కి బంపరాఫరిచ్చిన తెలంగాణ ప్రభుత్వం !

24th, April 2017 - 03:01:21 PM


ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి- ది కంక్లూజన్’ కు తెలంగాణ ప్రభుత్వం బంపరాఫరిచ్చింది. మొదట రిలీజైన తర్వాత మొదటి 10 రోజుల వరకు అన్ని థియేటర్లలో 6 షోల వరకు వేసుకోవచ్చని అనుమతిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి నాలుగు కాకుండా ఐదు షోలు వేయొచ్చని అనుమతిచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన ప్రసాద్ దేవినేని స్వయంగా తెలిపారు.

అలాగే అడిగిన వెంటనే అనుకూలంగా స్పందించి అనుమతిచ్చిన తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలని, మొదటి 10 రోజుల్ తర్వాత అన్ని థియేటర్లలో 5 షోలు వేస్తామని తెలిపారు. ఇలా రోజుకు ఐదు షోలు ప్రదర్శించడం వలన చిత్ర వసూళ్లు వేగం పుంజుకుని మరింతగా పెరిగే అవకాశముంది. ఇకపోతే 170 నిముషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే 6500 థియేటర్లలో రిలీజవుతుండటం విశేషం.