సినిమా థియేటర్లకు ఊరట కల్పించిన తెలంగాణ ప్రభుత్వం!


కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లు చాలా కాలం మూతపడడంతో థియేటర్ల యజమానులు ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఈ నేపధ్యంలో వారికి ఆర్థికంగా వెసలుబాటు కల్పించేదుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ తక్షణమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పుకొచ్చింది.

అయితే థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ 2018లో జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద మాత్రమే పార్కింగ్ ఫీజులు వసూలు చేయాలని, మల్టీప్లెక్సులు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశిస్తూ వీటికి పాత పద్ధతే అమలు చేయాలని సూచించింది. ఇదిలా ఉంటే ఈ నెల 23నుంచి తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే.

Exit mobile version